అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని గౌడనహళ్ళి గ్రామంలోని ఎస్సీ కాలనీలో తాగునీటి బోరు మరమ్మతుకు గురైంది. ఈ కాలనీలో 250 కుటుంబాలు నివసిస్తున్నాయి. రెండు నెలలుగా నీటి సమస్యతో సతమతమవుతున్నారు. నీటికోసం సైకిల్, ద్విచక్ర వాహనం, ఆటోలతో మరికొందరు నడుచుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఉన్న వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్నారు.
నీటి బోరు పని చేయకపోవటంతో రెండు నెలల నుంచి రైతుల పొలాల్లో ఉన్న వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీటిని తెస్తున్నాం. మా బాధలు గుర్తించి నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు వేడుకున్నారు.
ఇదీ చూడండి