ETV Bharat / state

గృహిణి ఆత్మహత్యాయత్నం.. భర్త వేధింపులే కారణం - ananthapuram district dowry harassment news

అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులు తాళలేక ఓ వివాహిత మేడ పైనుంచి దూకి తీవ్రంగా గాయపడింది. స్థానికులు చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.

భర్త వేధింపులు... మేడ పైనుంచి దూకిన వివాహిత

author img

By

Published : May 3, 2020, 5:25 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో గృహిణి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన మహమ్మద్​తో... రుమానియాకు 11 నెలల కిందట వివాహం జరిగింది. మూడు నెలలు అన్యోన్యంగా ఉన్న వీళ్ల కాపురంలో గొడవలు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి రూ.50 వేలు అదనపు కట్నం తీసుకురావాలని మహమ్మద్​ భార్యను వేధించేవాడు. ఈ విషయమై మరోమారు దంపతుల మధ్య గొడవ జరిగింది. రుమానియా చేతిపై భర్త వాతలు పెట్టాడు.

విషయం తెలుసుకున్న రుమానియా మేనత్త... సర్దిచెప్పేందుకు మహమ్మద్ ఇంటికి వెళ్లింది. తన ఎదుటే మేనత్తను చులకన చేస్తూ మాట్లాడిన మహమ్మద్ తీరు భరించలేక రుమానియా మేడ పై నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అదనపు కట్నం కోసం తమ బిడ్డను వేధిస్తున్న అల్లుడిపై చర్యలు తీసుకోవాలని గృహిణి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి:

ముందు నువ్వే కావాలని.. తర్వాత కట్నం రాలేదని!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.