అనంతపురం జిల్లా తనకల్లుకు చెందిన బీటెక్ విద్యార్థిని శ్రీనిత్య కంటి చూపు కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఘటనపై 'ఈటీవీ భారత్'లో వచ్చిన కథనానికి పలువురు దాతలు స్పందించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్థిక శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న దామోదర్ ఆర్థిక సాయం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇరవై వేల రూపాయలను విద్యార్థిని తల్లికి అందజేశారు. దామోదర్ మిత్రుడు జయంత్.. ఆయన స్నేహితులు రూ.11,600 సహాయం చేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ శ్రీనిత్య బెంగళూరులో శస్త్రచికిత్స చేయించుకుంది. దీంతో పరిస్థితి మెరుగు పడకపోగా.. చూపు కోల్పోయింది. ఉన్నత విద్యను అభ్యసించి కలెక్టర్ కావాలన్న ఆమె లక్ష్యం అంధకారం అయ్యింది. ఆ విద్యార్థి పరిస్థితిపై ఈటీవీ భారత్లో ఇటీవల కథనం వచ్చింది.
ఇదీ చదవండి: కంటిచూపు కావాలంటూ 'నిత్య' రోదన ..!