అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో వర్షాలు పడక రైతులు అల్లాడిపోతున్నారు. వర్షాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు వర్షం కురుస్తుందా.. సాగు చేద్దామా అని ఆకాశం వైపు చూస్తున్నారు. భగవంతుడు కరుణించి నోరులేని జీవాల కోసమైనా వర్షాలు కురిపిస్తాడనే వింత ఆచారంతో గాడిదలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టణంలో వాటిని ఊరేగించారు. ఇప్పటికీ వరుణుడు కరుణించకపోతే.. తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటూ రైతులు వాపోతున్నారు.
ఇది కూడా చదవండి.