అనంతపురం జిల్లాలోని సర్వజనాస్పత్రికి రాయల్ ఫ్రెండ్స్ స్వచ్ఛంద సంస్థ వారు 20 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళమిచ్చారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఆత్మారామ్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.నీరజలకు వీటిని అందించారు. మూడో విడత వైరస్ విజృంభిస్తుందనే నిపుణుల హెచ్చరికలతో రాయల్ ఫ్రెండ్స్ మరో నాలుగు సంస్థలు, అమెరికాలో స్థిరపడిన మన దేశీయుల సాయంతో వితరణ చేయగలిగామని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో వీలైనంత సహాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ప్రాణ వాయువు అందక ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేసి ఆస్పత్రికి అందించామన్నారు. ఇప్పటికే ప్రభుత్వాస్పత్రిలో మూడు వందల పడకలతో పిల్లల వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. కొవిడ్ మూడో దశ ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందించినందుకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఆత్మారామ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కాన్సంట్రేటర్లను కరోనా సోకిన చిన్నారులకు వినియోగిస్తామని డా.నీరజ చెప్పారు.
ఇదీ చదవండి: