Police dog dead: అనంతపురం జిల్లా పోలీసు భద్రతా విభాగానికి చెందిన పోలీసు జాగిలం సోని మృతి చెందింది. 12 ఏళ్లుగా పోలీసు శాఖకు ఎనలేని సేవలు అందించిందని ఎస్పీ తెలిపారు. సోని మృతి తీరనిలోటని జిల్లా పేర్కొన్నారు. లాబర్ జాతికి చెందిన సోని 12 సంవత్సరాల కిందట అనంతపురం జిల్లా పోలీసుశాఖలో అడుగు పెట్టిందని చెప్పారు. ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుళ్లు మనోహర్, శివశంకర్‌లు ఈ జాగిలానికి సంరక్షకులుగా ఉన్నారన్నారు. హత్యలు, దొంగతనం కేసుల ఛేదింపులో సమర్థంగా పని చేసిందని అన్నారు. వయసు మీద పడటంతో సోని నిన్న రాత్రి మృతి చెందింది. ఎస్పీ ఆదేశాలతో మంగళవారం నివాళులర్పించిన అనంతరం... జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో అధికారిక లాంఛనాలతో జాగిలానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: నెల్లూరులో భారీగా మద్యం బాటిళ్లు సీజ్...
అనంతపురంలో పోలీస్ జాగిలం మృతి... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు - అనంతపురం లేటెస్ట్ అప్డేట్స్
Police dog dead: అనంతపురం జిల్లా పోలీసు భద్రతా విభాగానికి చెందిన పోలీసు జాగిలం సోని మృతి చెందింది. 12 ఏళ్ల పాటు పోలీసు శాఖకు సోనీ సేవలు అందించిందని జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప తెలిపారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.