హిందూపురంలోని కొవిడ్-19 ఆసుపత్రి, ప్రయోగశాలను జిల్లా సంయుక్త కలెక్టర్ సిరి తనిఖీ చేసి సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఆసుపత్రిని హిందూపురం పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
కరోనా వైరస్ వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారి నుంచి బయటపడవచ్చని అన్నారు. రాబోయే కాలంలో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని.. అందరూ జాగ్రత్తలు తీసుకునే విధంగా సలహాలు, సూచనలను హిందూపురంలోని అధికారులకు తెలిపామన్నారు.
కరోనా వైరస్‌తో ప్రజలు కలిసి జీవించాలని కొవిడ్ ఒక ఫ్లూలా వ్యాప్తి చెందుతుందని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కాకపోతే వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీలు దీర్ఘకాల వ్యాధిగ్రస్ధులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన చిలమత్తూరు-కొడికొండ చెక్ పోస్టు వద్ద వలస కార్మికులు వచ్చి వెళుతుండటంతో అక్కడ సదుపాయాల గురించి స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఇది చదవండి 9న సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల సమావేశం