ETV Bharat / state

పుట్టపర్తిలో పర్యటించిన జిల్లా సహాయ కలెక్టర్ - పుట్టపర్తిలో కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అనంతపురం జిల్లాలోనూ తన ప్రభావాన్ని చూపిస్తుంది. జిల్లాలోని పుట్టపర్తిలో ఓ కానిస్టేబుల్​కు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయాన్ని పరిశీలించేందుకు, పరిస్థితిని సమీక్షించేందుకు పుట్టపర్తిలో సహాయ కలెక్టర్ పర్యటించారు. వైరస్ నివారణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

District Assistant Collector toured in  Puttaparthi
అధికారులతో సమీక్షిస్తున్న సహాయ కలెక్టర్ జాహ్నవి
author img

By

Published : Apr 30, 2020, 5:12 PM IST

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పట్టణంలోని పరిస్థితిని జిల్లా సహాయ కలెక్టర్ జాహ్నవి సమీక్షించారు. బాధితునికి కాంటాక్ట్​లో ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్​కు తరలించామని తెలిపారు. పోలీస్ స్టేషన్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు రెడ్​జోన్ గా గుర్తించి కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి అనుమానం ఉన్న వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. రెడ్​జోన్ ప్రాంతాల్లోంచి ఎవరూ బయటకు రాకుండా, కొత్తవారు లోపలికి వెళ్లకుండా చూడాలని పోలీసులకు సూచించారు.

ఇదీచదవండి.

జిల్లా సరిహద్దుల మూసివేత: ఆర్డీవో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.