తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంలో... 15వేల 304 మంది గిరిజన లబ్ధిదారులకు అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం... భూములకు హక్కు పత్రాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అందజేశారు.
కర్నూలు జిల్లాలో..
శ్రీశైలం ఐటీడీఎ పరిధిలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల గిరిజనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో 600 వందల ఎకరాలను గిరిజనులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. శ్రీశైలం ఐటీడీఎ పరిధిలో నిర్మించే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని రూ. 50 కోట్లతో నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డితెలిపారు.
విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజనులకు అటవీ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, ఎమ్మెల్యేలు జోగారావు, రాజన్నదొర, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గిరిజనులకు అందిస్తున్న పట్టాలపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో..
అనంతపురం జిల్లాలో గిరిజనులకు 245 ఎకరాల అటవీ హక్కుదారుల పాసు పుస్తకాలను మంత్రి శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడు...అర్హులైన గిరిజనులకు పంపిణీ చేశారు. కొన్నేళ్లుగా అటవీ శాఖ పరిధిలో భూములను వ్యవసాయం చేస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ఈ పట్టాలు కేటాయించామని కలెక్టర్ తెలిపారు.
విశాఖ జిల్లాలో ..
విశాఖ జిల్లా పాడేరు ఐటిడిఏ సమావేశ మందిరంలో మంత్రి అవంతి శ్రీనివాస్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు. 43 వేల ఎకరాలు 76,000 మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి వినయ్ చంద్ వివరించారు. పోడు భూములకు పట్టాల వల్ల గిరిజన ప్రాంతంలో కోదు జాతి గిరిజనులకు ఎంతో మేలు జరుగుతుందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: