కరోన వ్యాప్తి నివారణకు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఆశావర్కర్ల సేవలు ప్రశంసించతగినవి. కంటైన్మైంట్ జోన్లలో ప్రజలకు కావాల్సిన వైద్య సేవలు ఆశ వర్కర్స్ సహాయంతోనే సాగుతాయి. అయితే వీరికి ప్రతి నెల జీతాలు అందక వచ్చే అరకొర డబ్బుతో జీవనం సాగిస్తున్నారు.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని బసవనపల్లి గ్రామంలో... కొందరు దాతలు ఆశా వర్కర్లకు తమ వంతు సహాయం అందించి అండగా నిలవాలని నిశ్చయించుకొన్నారు. ఈ క్రమంలో నిత్యావసర సరుకులు, శానిటైజర్లను ఎంపీడీవో మునిస్వామి చేతుల మీదుగా ఆశ వర్కర్లకు పంపిణీ చేశారు. ఆశ వర్కర్లు దాతల దాతృత్వనికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: