అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం మలమీదపల్లిలో లబ్ధిదారులు... అధికారులతో వాగ్వాదానికి దిగారు. గ్రామ సమీపంలో స్థలమున్నా ఇవ్వకుండా... ముంపునకు గురయ్యే ప్రాంతంలో స్థలం కేటాయించారని.. ఆ స్థలాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోచోట పట్టాలు ఇస్తేనే తీసుకుంటామంటూ అధికారులకు తేల్చి చెప్పారు.
అర్హుల జాబితాలో తన పేరున్నా... పట్టాల పంపిణీ జాబితాలో తన పేరు రాలేదని ఆరోపిస్తూ గార్లదిన్నెలో లబ్ధిదారుడు నీటిట్యాంక్ ఎక్కి ఆందోళన చేశాడు. అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పపినా వినలేదు. కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొంత సమయం తరువాత కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నెల్లూరులో..
మర్రిపాడు మండలం నందవరంలో లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. నివాసాలకు అనుకూలంగా లేని స్థలాలు కట్టబెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లపట్టాలు తీసుకోకుండానే మహిళలు వెనుదిరిగారు.
ఇదీ చూడండి: