ETV Bharat / state

Diarrhea Attack: అనంతపురం జిల్లాలో డయోరియా వ్యాప్తి.. ఒకరు మృతి.. - అనంతపురం జిల్లాలో డయోరియా మృతులు న్యూస్

Diarrhea Attack: అనంతపురం జిల్లాలో డయేరియా వ్యాధి కోరలు చాచింది. ఈ వ్యాధి సోకిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. సదరు మహిళ సంబంధికులైన మరో ఐదుగురు ఈ వ్యాధిబారిన పడి.. చికిత్స పొందుతున్నారు. బాధిత గ్రామంలో సుమారు 15 మంది ఈ వ్యాధి బారినపడటంతో.. వైద్య విభాగం అప్రమత్తమైయ్యింది.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 18, 2023, 6:18 PM IST

Diarrhea Attack: అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలం బొల్లనగుడ్డం గ్రామంలో అతిసార వ్యాధి కోరలు చాచింది. ఈ డయేరియా వ్యాధి సోకి గ్రామానికి చెందిన శాంతమ్మ (23) అనే మహిళ కర్ణాటకలోని బళ్ళారి ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించింది. ఆమె ఇంట్లో మొత్తం ఐదుగురు అతిసార వ్యాధి బారిన పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన సుమారు 15 మంది అతిసార వ్యాధి బాధితులు కర్ణాటకలోని బళ్ళారి, రూపనగుడి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్సలు పొందుతున్నారు.

గత మూడు రోజులుగా ప్రజలు ఈ అతిసార వ్యాధి భారిన పడి అల్లాడిపోతున్నారు. వాటర్ ట్యాంక్​ను సరిగా క్లీన్ చేయని కారణంగానే గ్రామస్థులు అనారోగ్యానికి గురయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ, ఆర్​డబ్ల్యూఎస్ అధికారులు, వైద్యారోగ్య శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి.. అపరిశుభ్రత నివారణకు చర్యలు చేపట్టారు. మురుగు ఉన్నచోట ఇసుక వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఆరోగ్య ఉప కేంద్రం చుట్టూ ఉన్న కంప చెట్లు తొలగించారు. ట్యాంకులను శుభ్రం చేయించి క్లోరినేషన్ చేయించారు. జిల్లా ఆహార భద్రత అధికారి రామచంద్ర.. గ్రామంలోని తాగునీటి నమూనాలను తీసుకుని ల్యాబ్​కు పంపించారు. తాగునీటి వల్ల ఎలాంటి సమస్య లేనట్లు నివేదిక వచ్చినట్లు అధికారులు తెలిపారు.

అయితే మరోసారి తాగునీటి నమూనాలు సేకరించి ల్యాబ్​కు పంపిస్తామని అధికారులు తెలిపారు. గ్రామంలో ఒక్కసారిగా వాంతులు, విరోచనాలతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు దర్గా హోన్నూరు ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని రఫియా సుల్తానా, హెచ్​ఏ గోవర్ధన్ తెలిపారు. గ్రామంలో వైద్య శిబిరం ద్వారా 50 మందికి వైద్య సేవలు అందించినట్లు వారు పేర్కొన్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుద్ధ్యం ఏర్పాటు చేసి.. అతిసార వ్యాధి నుంచి అధికారులు తమను రక్షించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

"మేము ఈ గ్రామంలో నాలుగురోజుల పాటు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ గ్రామంలోని రెండు వాటర్ సాంపుల్స్ పంపించాము. అయితే నీటిలో ఎలాంటి సమస్య లేదని రిపోర్టులో వచ్చింది. అయితే ఫుడ్ పాయిజన్ కారణంగానే గ్రామస్థులు అతిసారం వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అతిసార వ్యాధిగ్రస్థులు హైయర్ హాస్పిటల్స్​కు వెళ్లి.. చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ గ్రామంలో పరిస్థితి నార్మల్​గానే ఉంది." - వైద్యాధికారి

అతిసార వ్యాధి లక్షణాలు:

  • వాంతులు
  • విరేచనాలు
  • వికారంగా ఉండడం
  • తక్కువ ఉష్ణోగ్రతతో జ్వరం
  • డీసెంట్రి ఐతే రక్త విరేచనాలు
  • సాధారణంగా ఈ వ్యాధి సోకినవారు 2 నుంచి మూడు రోజుల్లో కోలుకుంటారు. చిన్నపిల్లల్లో అయితే అతిసార వ్యాధి ఐదు నుంచి ఏడు రోజుల లోపే తగ్గిపోతుంది. కొన్ని సందర్భల్లో రెండు వారాల వరకు ఈ వ్యాధి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.