అయోధ్యలో నిర్మిస్తున్న రామ దేవాలయానికి 614 కేజీల గంటను తమిళనాడులోని రామేశ్వరం నుంచి రామ రథయాత్ర ద్వారా అనంతపురం జిల్లా పెనుకొండ జాతీయ రహదారి నుంచి తీసుకెళ్తున్నారు రాజ్యలక్ష్మి అనే భక్తురాలు. స్వయంగా తానే గంట చేయించి .. తానే వాహనం నడుపుకుంటూ అయోధ్యకు తీసుకెళ్తున్నారు. తాను ఎంతో అదృష్టం చేసుకున్నానని.. అయోధ్యలో రామ మందిరానికి ప్రధాని మోదీ భూమిపూజ ప్రారంభించినప్పుడే... అక్కడ గంట ఏర్పాటు చేద్దామనుకున్నానని అందుకోసం అన్ని చర్యలు తీసుకున్నానని ఆమె తెలిపారు.

దాదాపు ఒక నెల వరకు రథయాత్ర ద్వారా ప్రతి ఊరుకు తీసుకెళ్తూ ... భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. దీనికి తగ్గట్టు పోలీస్ బందోబస్తు ఆధ్వర్యంలో రథయాత్ర కొనసాగుతుందన్నారు.
ఇదీ చూడండి. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు: వాతావరణ కేంద్రం