ETV Bharat / state

అవస్థలు కోకొల్లలు.. అభివృద్ధిపై ఆశలు - అనంతపురంలో తాజా వార్తలు

కరోనా కారణంగా అనంతపురంలో అభివృద్ధి కుంటు పడింది. మరో వైపు ప్రభుత్వ శాఖలు విధులను సరిగా నిర్వహించటం లేదు. తాజా ఏడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటలు నీటమునిగాయి. దీంతో రైతులు అధికంగా దెబ్బతిన్నారు. అన్నదాతలకు అందవలసిన పరిహరం కూడా వారికి చేరట్లేదు. ప్రజల కనీస అవసరాలైన వైద్యం, తాగునీరు,ఉపాధి వంటివి కూడా సరిగా అందక పోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.

Development in Anantapur
అనంతపురంలో అభివృద్ధి
author img

By

Published : Nov 2, 2020, 8:55 AM IST

అనంతపురంలో జిల్లా పురోగతి తడబడుతోంది. ఆటంకాలతో అభివృద్ధి వైపు అడుగు పడటంలేదు. కొవిడ్‌ మహమ్మారి ఏడు నెలలుగా జిల్లా ప్రగతిని తలకిందులు చేసింది. జిల్లా అధికార యంత్రాంగం కరోనా నిర్మూలన కోసమే నిత్యం శ్రమించింది.. శ్రమిస్తోంది. కొన్ని ప్రభుత్వ శాఖలు మాత్రం విధి నిర్వహణలో విఫలమయ్యాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అన్నదాతకు అపార నష్టం వాటిల్లింది. రూ.వందల కోట్లలో పంట దెబ్బతింది. వీరికి భరోసా, ప్రోత్సాహం అందించాలి. భూగర్భ జలాలు సద్వినియోగం చేసుకుంటూనే.. హెచ్చెల్సీ, హంద్రీనీవా నీటిని పూర్తిగా వినియోగించాలి. నవరత్నాల్లో కీలకం ‘నాడు-నేడు’ పథకం. ఇందులో మాటలు.. చేతలకు పొంతన లేని పరిస్థితి. ఇళ్ల పట్టాల పంపిణీకి స్థలాల ఎంపికలో గందరగోళం నెలకొంది. ఏడాది దాటినా సచివాలయాల వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు. ఇలాంటి వెంటాడుతున్నాయి. వైద్యం, వ్యవసాయం, జలాలు, తాగునీరు, ఉపాధి, గృహనిర్మాణం, నాడు-నేడు, సచివాలయాలు.. వంటి కీలక విభాగాలపై సోమవారం(2న) జిల్లా సమీక్ష కమిటీ(డీఆర్‌సీ) సమావేశం జరగనుంది. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది. ప్రజా పురోగతికి కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. జిల్లాలో కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే..

పడకేసిన ఉపాధి

జిల్లాలో ఉపాధి హామీ పథకం కీలకం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. ఈ క్రమంలో.. కేంద్రం నిధులతో చేపడుతున్న ఉపాధి పనులు ఎక్కడికక్కడ పడకేశాయి. నవరత్నాలు పథకాలకు ఈ నిధులను అనుసంధానం చేశారు. ఇప్పటి దాకా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.653.55కోట్ల మేర ఖర్చు చేశారు. వేసవిలో పనులు ముమ్మరంగా సాగాయి. ఇప్పుడు కూలీలకు పనుల్లేవు. వేతనాల శాతం 84.61, సామగ్రి శాతం 15.39 మేర ఉంది. సామగ్రి శాతం 40 దాకా వ్యయం చేసుకోవచ్ఛు నాడు-నేడు, అంగన్‌వాడీ, ఆరోగ్య క్లినిక్‌, సచివాలయాలు.. వంటి భవనాల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమన్వయ శాఖల్లో ఉపాధి ప్రగతి అటకెక్కింది. ఉద్యాన పంటలు, జలకళ.. వంటి పథకాలు సైతం ముందుకు సాగలేదు.

ఆరోగ్యం.. నిర్లక్ష్యం

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కొవిడ్‌ మహమ్మారి నియంత్రణలో అహర్నిశలు శ్రమించింది. కొవిడ్‌ బూచితో కొందరు వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది విధులకు ఎగనామం పెడుతున్నారు. క్షేత్రస్థాయిలో కీలకమైన సీహెచ్‌సీ, పీహెచ్‌సీలు దయనీయంగా మారాయి. ఇక సర్వజన ఆసుపత్రిలోనూ అంతే. కొన్ని విభాగాల వైద్యులు ఏడు నెలలుగా కనిపించడం లేదు. కొందరు సంతకాలు పెట్టేసి ప్రైవేట్‌ క్లినిక్‌ల్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా... ఆరోగ్య శాఖకు కీలకమైన డీఎంహెచ్‌వో 40 రోజులుగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. దీంతో ఇక్కడి కార్యక్రమ అధికారులు(పీఓ) విధులకే రావడం లేదు. కొందరు అధికారులైతే హాజరు రిజిస్టర్‌ను భవన సముదాయం కిందకు తెప్పించుకుని సంతకం పెట్టి వెళ్తున్నారు. ఇప్పుడిప్పుడే విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. కనీసం ఈ జ్వరాలను చూసే నాథుడే కరవయ్యాడు. కొవిడ్‌ బాగా తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో ఇతర సంక్షేమ పథకాలపై దృష్టి సారించలేదు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు ఎవ్వరికీ చెప్పకుండా సెలవులో వెళ్తున్నారు. ఇలా నిర్లక్ష్యం గూడుకట్టుకుంది.

ఖరీఫ్‌ నష్టం.. రూ.1,620 కోట్లు

జిల్లాలో గత ఖరీఫ్‌లో సుమారు ఐదు లక్షల హెక్టార్లలో వేరుసెనగ పంటను సాగు చేశారు. ఆగస్టు మినహా.. మిగిలిన నెలల్లో కుండపోత వర్షాలే. దీంతో పంటకు ఆపారనష్టం జరిగింది. సుమారు 4.10 లక్షల హెక్టార్లలో పంట పూర్తిగా పోయిందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల బృందాలు లెక్కలు తేల్చాయి. ఆ ప్రకారం సుమారు రూ.1,620 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా. పత్తి, మొక్కజొన్న, వరి, మిరప, టమోటా వంటి పంటలు 41 వేల హెక్టార్లలో దెబ్బతింది. సుమారు రూ.158 కోట్లు నష్టం లెక్కగట్టారు. కంటి తుడుపుగా రైతు భరోసా సొమ్ము అందించడం కాదు.. జరిగిన పంట నష్టానికి పరిహారం అందించి ఆదుకోవాలని జిల్లా రైతులు కోరుతోంది. సెప్టెంబరు, అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు వేరుసెనగ పంట తడిసింది. కాయలు నల్లగా మారాయి. సుమారు 2లక్షల హెక్టార్ల పంట దెబ్బతింది. తడిసిన వేరుసెనగ కాయలు కొనేవారు లేరు.

పరిహారమేదీ?

జిల్లాలో 2018లో భారీగా పంట నష్టం జరిగింది. అప్పట్లో వ్యవసాయాధికారులు పంటనష్టం అంచనా వేసి ప్రభుత్వానికి పంపారు. అప్పటి ప్రభుత్వం రూ.931.60 కోట్లు పంటనష్ట పరిహారం 5.60 లక్షల మంది రైతులకు మంజూరు చేసింది. రెండు, మూడు నియోజకవర్గాల్లో గత ప్రభుత్వం కార్యకర్తల పేర్లు జాబితాలో ఎక్కించారన్న కారణంతో మళ్లీ సర్వే చేసి జాబితా సిద్ధం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో జాబితా పంపారు. పరిహారం మాత్రం నేటికీ చెల్లించలేదు. రైతులు, రైతు సంఘాలు, పలు పార్టీల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నా పట్టించుకోలేదు. మూడేళ్లు గడుస్తున్నా పరిహారం పంపిణీ కలగానే మిగిలిపోయింది.

పనులు అర్ధాంతరం

పాఠశాల స్థాయిలో కొన్ని రకాల సామగ్రి, కేంద్రీకృత విధానంలో, మరికొన్ని నాడు-నేడు ద్వారా పాఠశాలలకు సౌకర్యాలు కల్పించాలి. కేంద్రీకృతం ద్వారా సరఫరా చేయాల్సిన పలు రకాల వస్తువులు ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు. ఫలితంగా పనులు అర్ధాంతరంగా ఆగాయి. జిల్లాలో 1296 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. కేంద్రీకృత విధానం ద్వారా సరఫరా చేయాల్సిన రూ.115 కోట్ల విలువైన సామగ్రి వివరాలను ప్రధానోపాధ్యాయులు యాప్‌లో పొందుపరిచారు. ఇప్పటి దాకా కేవలం రూ.10కోట్ల సామగ్రి మాత్రమే సరఫరా అయింది. ఇంకా రూ.110 కోట్ల సామగ్రి సరఫరా చేయాల్సి ఉంది. జిల్లాలో 51 పాఠశాలల్లో రూ.60కోట్లతో నాబార్డు ద్వారా గుత్తేదారులు పనులు చేస్తుండగా వేగం పుంజుకోలేదు. వాటిని నాడు-నేడు ప్రగతిలోకి కలపడంతో వెనుకబడ్డారు.

సూక్ష్మసాగు.. సుదూరం

జిల్లాలో బిందుసేద్యానికి ఈ ఏడాది రూ.214 కోట్లతో 32 వేల హెక్టార్లు లక్ష్యంగా నిర్ణయించారు. ప్రారంభంలో ఐదు వేల మంది రైతులు ఆరు వేల హెక్టార్లకు రిజిస్ట్రేషన్‌ కూడా చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు నేటికీ విడుదల కాలేదు. రైతుల నుంచి ఒత్తిడి వస్తోందని భావించిన అధికారులు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆపేశారు. నేటికి రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 2019లో రూ.160 కోట్లు బకాయిలను ప్రభుత్వం కంపెనీలకు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచింది. కంపెనీలు సామగ్రి పంపిణీకి ముందుకు రావడంలేదు. నిధులు వస్తాయో? రావో అన్న అనుమానం కంపెనీల ప్రతినిధులను వెంటాడుతోంది.

ఇంటి కల నెరవేరేనా..!

నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణం, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 1,14,621 మంది లబ్ధిదారులను గుర్తించారు. వారికి 2,900 ఎకరాలు భూమి అవసరం కాగా, 2,272 ఎకరాలు భూమి అందుబాటలో ఉంది. ఇంకా 628 ఎకరాలు కావాల్సి ఉండగా 602 సేకరించారు. రూ.123.19 కోట్లకు గాను, రూ.75.69 కోట్లు భూ పరిహారం చెల్లించారు. ఇంకా రూ.47.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. అనువుగానిచోట ఇంటి పట్టాలు సిద్ధం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీరు చేరి బురదగా మారాయి. పిచ్చిమొక్కలు, కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయాయి.

జలం వృథా!

ఈసారి వర్షాలు అత్యధికంగా కురిశాయి. నిర్దేశిత వర్షపాతం కంటే 80 శాతం అధికంగా కురిసింది. వీటికి తోడు హంద్రీనీవా, హెచ్చెల్సీ కాలువల ద్వారా దండిగా నీరు చేరుతోంది. రెండు కాలువల ద్వారా ఇప్పటికే 28.463 టీఎంసీల నీరు వచ్చింది. ఈ నీటికి తగినంత ఆయకట్టు సాగు కాలేదు. జలాల పంపిణీ ప్రక్రియలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంజినీర్లు తయారీ చేసిన ప్రణాళిక క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. దీనికి కొందరు ప్రజా ప్రతినిధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారన్న వాదన లేకపోలేదు. హంద్రీనీవా కాలువకు గండ్లు కొడుతున్నారు. ఇటీవల హెచ్చెల్సీకి కూడా ఇదే దుస్థితి ఏర్పడింది. దీని వల్ల చివరికు నీరు పారడం గగనం అవుతోంది. చెరువులు నింపడం కనాకష్టమైంది. ఇప్పటికే హంద్రీనీవాలో 3.376 టీఎంసీలు వృథా అయ్యాయి.

యంత్రం.. కుతంత్రం

జిల్లాకు ఏటా యాంత్రీకరణ పథకం కింద రూ.20 కోట్లు బడ్జెట్‌ నిధులు విడుదల చేసేవారు. వ్యక్తిగతంగా పరికరాలు, యంత్రాలు రైతులకు రాయితీతో అందించేవారు. ఖరీఫ్‌ కాలంలో రాయితీతో అందించేవారు. అయితే ఇప్పటికీ ఒక్కపైసా నిధులు రాలేదు. ఈ ఏడాది గ్రూపులను ఎంపిక చేసి, రాయితీతో పరికరాలు, యంత్రాలు అందించాలని నిర్ణయించారు. అయితే ఖరీఫ్‌ పంట కాలం ముగిసినా అతీగతీలేదు.

ఇదీ చదవండీ...

పోలవరంపై నేడు హైదరాబాద్​లో కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.