తెదేపాపై ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా విమర్శలు మండలిలో తనను ఎవరూ బెదిరించలేదని ఛైర్మన్ చెప్పినప్పటికీ తెదేపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆయన మూడు రాజధానుల ఆలోచన రాష్ట్ర సమగ్రాభివృద్ధికే అని ఆయన స్పష్టం చేశారు. రాజధానుల బిల్లులను మండలిలో అడ్డుకోవాలని చూడటం బాధాకరమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని తమతో పాటు అన్ని పార్టీల సభ్యులు ఛైర్మన్‌ను కోరినప్పటికీ.. విచక్షణాధికారాల పేరిట తెదేపా అధినేత చంద్రబాబు చెప్పినట్లు నడుచుకున్నారని విమర్శించారు. తెదేపా తీరును ప్రజలు గమనిస్తున్నారని, కుల, మతాల పేరిట ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలి రద్దుపై సోమవారం జరిగే చర్చ అనంతరం నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి:
'తండ్రి ఆశయాలకు తనయుడు తూట్లు..!'