అనంతపురం జిల్లా మడకశిర మండలంలో 10 వేల హెక్టార్లలో వేరుశనగ పంటను రైతులు సాగు చేశారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు పంటలు పచ్చగా ఆశాజనకంగానే ఉన్నాయి. మండలంలోని ఆర్.అనంతపురం, గౌడనహళ్ళి, కల్లుమరి పంచాయతీ పరిధిలోని గ్రామాలలో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటపై రాత్రి సమయాల్లో జింకలు గుంపులు గుంపులుగా వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి.
అటవీశాఖ అధికారులు జింకల బెడద నుంచి పంటను కాపాడాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. పంట నష్టం వాటిల్లిన రైతులను గుర్తించి ప్రభుత్వ నుంచి పరిహారం వచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: