Minister Konda Surekha Buys Slippers and Clothes for Poor Child: తెలంగాణ మంత్రి కొండ సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండా సురేఖకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ కూడలి వద్ద రోడ్డుపై చెప్పులు లేకుండా తండ్రితో వెళ్తున్న ఒక బీహార్ పాపను చూశారు. చెప్పులు లేకుండా ఎండలో వెళ్తున్న ఆపాపను చూసి మంత్రి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వారిని రప్పించారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళుతున్నారు? అని మంత్రి ఆరా తీశారు. చెప్పులు లేకుండా వెళ్తున్న ఆ పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. అంతే కాకుండా ఆ పాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు.
అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే - వారిని శిక్షించకపోతే సమాజానికే ఇబ్బంది : సీఎం
నడిరోడ్డుపై నెత్తురులాంటి ప్రవాహం! - మర్డర్ జరిగిందా, జంతువధా?