తీవ్ర వర్షాభావ పరిస్థితులు... వన్యప్రాణులకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. అనంతపురం జిల్లా తలుపులు, నంబులపూలకుంట మండలాల్లో దట్టమైన అడువులున్నాయి. వర్షాలు లేక అటవీ ప్రాంతంలో మేత కొరవడింది. ఫలితంగా... జింకలు మేత, నీళ్ల కోసం పంట పొలాల వైపు వస్తున్నాయి. రైతులను చూసి పారిపోయే క్రమంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందడం, కుక్కల దాడిలో, వేటగాళ్ల చెతిలో చనిపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ రెండు రోజల వ్యవధిలోనే 2 జింకలు మరణించాయి.
వన్యప్రాణి సంరక్షణ పేరుతో నిధులు ఖర్చు చేస్తున్న అటవీశాఖ అధికారులు జింకల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు నామ మాత్రమే అని ఇలాంటి ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికైనా అటవీ శాఖ ఆధికారులు స్పందించి... జింకలకు నీటిని అందించే ఏర్పాటు చేయాల్సిన అవరసం ఉంది.
ఇదీ చదవండి