అనంతపురం జిల్లా కంబదూరు మండలం పి.వెంకటంపల్లి సమీపంలో జింక మృతి చెందింది. పాలూరు - వెంకటంపల్లి గ్రామాల మధ్యలో కుక్కల గుంపు జింకపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలో.. అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ విషయంపై అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు. అటవీ అధికారి రామేశ్వరి జింకను పరిశీలించి చనిపోయినట్లు నిర్ధరించారు. పోస్టుమార్టం అనంతరం దహనం చేశారు.
ఇదీ చదవండి: