అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం, చుక్కలూరు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో రోడ్డు పనుల కోసం తవ్విన గుంత ప్రమాదకరంగా మారింది. మూడు నెలలుగా పాఠశాల ఎదుటే యమగండంగా ఉన్న ఈ నీటి గుంత పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కల్వర్టు వద్ద సుమారు 30 అడుగుల వెడల్పు, 15 అడుగుల లోతైన గుంత ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నీటి గుంతపై చర్యలకు దిగాలని ప్రధానోపాధ్యాయురాలు సర్వమంగల పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ప్రయాణం ప్రయాసే... 19 నుంచి క్యాబ్‌ల బంద్