ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు హనుమంతు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో దళిత హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో.. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందించారు.
భూమి లేని ప్రతి దళితుడికి మూడు ఎకరాల భూమి అందించాలని హనుమంతు అన్నారు. డప్పు, చర్మ కళాకారులకు పింఛన్లు మంజూరు చేయాలన్నారు. ప్రతి మండల కేంద్రంలో అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రామ్ భవనాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'సర్కార్ అసమర్థ విధానాలతో సంక్షోభంలో చేనేత రంగం'