ETV Bharat / state

అన్నదాతను నిలువునా ముంచిన అధిక వర్షాలు

author img

By

Published : Oct 26, 2020, 9:17 PM IST

అనంతపురం జిల్లాలో అధిక వర్షాలు అన్నదాతను నిలువునా ముంచేశాయి. ఏటా చినుకు కోసం ఎదురు చూసే రైతుపై, ఈసారి వరుణుడు అధిక వర్షాలతో కన్నెర్ర చేశాడు. విడతలవారీగా ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో ప్రధాన పంట వేరుశనగ ఏమాత్రం చేతికి రాకుండా పోయింది. చాలా గ్రామాల్లో వేరుశనగ కుళ్లిపోయి, బూజుపట్టి పశుగ్రాసానికి కూడా పనికిరావటంలేదు. దశాబ్ద కాలంలో ఎప్పుడూ లేని అతివృష్టి ఈసారి జిల్లాలో పంటలను తుడిచిపెట్టేసింది.

crops-loss
crops-loss

అనంతపురం జిల్లాలో నైరుతి రుతుపవనాల కాలంలో 338 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఈసారి 567 మిల్లీ మీటర్లు కురిసింది. జూన్ నుంచి సెప్టెంబర్ నెల వరకు 68 శాతం అధిక వర్షం నమోదైంది. అతివృష్టి వర్షాలతో ఖరీఫ్​లో సాగు చేసిన వేల హెక్టార్లలో పంటలు చేతికి రాకుండా పోయాయి. జిల్లావ్యాప్తంగా రైతులు కోట్ల రూపాయల విలువైన పంటలు కోల్పోయారు. వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, టమోటా పంటలకు తీవ్రంగా నష్టం జరిగినట్లు వ్యవసాయ, ఉద్యానశాఖలు అంచనావేశాయి.

అతివృష్టి వర్షాలతో అనంతపురం రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగింది. ఆగస్టు నెలలో ఇరవై రోజుల పాటు విరామం ఇచ్చిన వర్షాలు.. రైతులను ఒకింత ఆందోళనకు గురిచేశాయి. సెప్టెంబర్ నెలాఖరు నుంచి మూడు విడతలుగా పదిహేను రోజులు కురిసిన వర్షాలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. నైరుతి రుతుపవనాల సీజన్​లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనంతపురం జిల్లాలో సాధారణంగా 338 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాలి. ఈసారి ఆ నెలల్లో 567 మి.మీ కురిసింది. ఏటా లోటు వర్షపాతం నమోదయ్యే అనంత జిల్లాల్లో ఈసారి ఖరీఫ్ సీజన్ లో 68 శాతం అదనంగా వర్షం కురిసింది.

2010 లో ఖరీఫ్ సీజన్​లో 404 మి.మీ వర్షపాతం నమోదు కాగా, దాన్ని తిరిగరాసేలా ఈ ఏడాది 567 మిల్లీ మీటర్లు కురిసింది. అధిక వర్షాలతో పెట్టుబడి పూర్తిగా కోల్పోయామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదంతా కురవాల్సిన వర్షం అక్టోబర్ నాటికే కురిసినట్లు అర్థగణాంకశాఖ అధికారులు చెబుతున్నారు. కుండపోత వానలు అన్నదాతల పెట్టుబడిని జలసమాధి చేశాయి. అధిక పెట్టుబడితో సాగుచేసిన మిరప, వేరుశనగ, పత్తి పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది.

ఉరవకొండ, వజ్రఖరూరు, విడపనకల్లు మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగుచేసిన మిరప పంటకు విల్ట్ తెగులు సోకి పూర్తిగా ఎండిపోయింది. చాలా చోట్ల రైతులు తెగులు సోకిన మిరపను తొలగించి జొన్న వేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో చేతికొచ్చే వేరుశనగ, కోసి కుప్పవేసిన వేరుశనగ కట్టె అన్నిచోట్లా పదిహేను రోజుల వర్షానికి కుళ్లిపోయి పనికిరాకుండా పోయింది.

భారీ వర్షాలు కురిసిన చాలా గ్రామాల్లో నేటికీ పంట నష్టం అంచనాలు వేయలేదు. అనంతపురం నగరానికి సమీపంలోని రాప్తాడు మండలంలో తమ వద్దకు ఎవరూ రాలేదని, నష్టపోయిన పంటను చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అర్థగణాంక, వ్యవసాయశాఖలు సంయుక్తంగా పంటకోత ప్రయోగాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాల అనంతరం దిగుబడి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. 2018 లో ఖరీఫ్, రబీ పంటలు కరవుతో నష్టపోయిన రైతులకు 977 కోట్ల రూపాయలు నేటికీ విడుదల కాలేదు. గత ప్రభుత్వంలో జరిగింది తమకు సంబంధం లేదని కొందరు ప్రజాప్రతినిధులు రైతులకు నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: వైరల్​ కంటెంట్ నియంత్రణకు ఫేస్​బుక్ కీలక నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.