అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలో కురిసిన తేలికపాటి వర్షానికి లక్షలాది రూపాయల ఉద్యాన పంటలు కూరగాయల పంటలు దెబ్బ తిన్నాయి. ఇది రైతులను కన్నీరు పెట్టిస్తోంది. బోరంపల్లి, పాత చెరువు గ్రామాల్లో రైతులకు చెందిన అరటి పండ్లతోపాటు కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెవెన్యూ వ్యవసాయ అధికారులు వెంటనే స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు. ఉద్యాన పంటలకు బీమా సౌకర్యం కల్పించాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవీ చూడండి..