అనంతపురం జిల్లా శెట్టూరులో అగ్నిప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నంపల్లి గ్రామ రైతు గోవిందప్పకు చెందిన వేరుశెనగపంట వాముకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో సూమారు 25 ఎద్దుల బండ్ల పంట దగ్ధమైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల విలువైన పంట తగలబడిపోయిందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.
ఇవీ చదవండి