అనంతపురం జిల్లా కదిరి మండలం వరిగిరెడ్డిపల్లి వద్ద బావిలో పూడిక తీస్తున్న సమయంలో క్రేన్ బోల్తా పడి వెంకటేష్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పూడిక తీస్తున్నప్పుడు ఒక్కసారిగా పూడికతో పాటు వెంకటేష్ బావిలోకి పడిపోయాడు. స్థానికులు స్పందించి బాధితుడిని చికిత్స కోసం కదిరికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు.
ఇదీ చదవండి :