అనంతపురం డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. జిల్లాలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కొవిడ్ కేంద్రంగా మార్చాలంటూ నిరసన చేపట్టారు. జీజీహెచ్‌ని కొవిడ్ సెంటర్‌గా మార్చడం వల్ల సాధారణ రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సహజ మరణం పొందిన వారిని శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు అధిక వసూలు చేస్తున్నారని.. కనుక ప్రభుత్వమే అంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలని కోరారు. హోం క్వారంటైన్లో ఉన్న వారికి పౌష్ఠికాహారంతో పాటు రూ. 7 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :