CPI STATE SECREATARY RAMAKRISHNA: భారీ వర్షాలతో రాయలసీమ జిల్లాలు, నెల్లూరు ప్రాంతాల‌్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించినందున... బాధితులను ప్రభుత్వం సత్వరం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. కదిరి నియోజకవర్గం తనకల్లు, కదిరి పట్టణంలోని ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
జిల్లాలో జలాశయాలు తెగిపోయి మొత్తం 60 మంది చనిపోవడానికి ఇసుక మాఫియానే కారణమన్నారు. అలాగే మృతుల కుటుంబాలకు తక్షణమే 25 లక్షల రూపాయలు, కూలిన ఇళ్లు నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో చనిపోయిన బాధితులకు కోటి రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం.. కడప జిల్లాలో మృతి చెందిన వారికి ఐదు లక్షలే ఎందుకు ఇస్తోందని రామకృష్ణ ప్రశ్నించారు.
జిల్లాలోని ప్రధాన పంటలైన వేరుశెనగ, వరి పూర్తిగా దెబ్బతిన్నాయని రామకృష్ణ అన్నారు. పంట నష్టాన్ని అంచనాలు వేసి నష్టపోయిన ప్రతి అన్నదాతకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో మున్సిపల్ అధికారుల అందరి లక్ష్యం కారణంగా మూడు భవనాలు కూలి ఆరుగురు మృత్యువాత పడ్డారని ఇందుకు బాధ్యులైన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
ఇదీ చూడండి: CPI NARAYANA ON FLOODS: 'జాతీయ విపత్తుగా ప్రకటించి.. తిరుపతిని ఆదుకోవాలి..!'