అనంతపురం జిల్లా శింగనమల మండల కేంద్రంలో సీపీఐ నేత చెన్నప్ప యాదవ్ ఆద్వర్యంలో ఎంపీడీవో ఆఫీసు వద్ద ధర్నా చేపట్టారు. అర్హులైన వారందరికీ చేతివృత్తిదారులకు రూ. 10 వేల ఆర్ధిక సాయం పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం పథకాల్లో అనర్హులకు స్థానిక నేతలు చోటు కల్పించి అర్హులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కులం, మతం ప్రాంతం చూడబోమని చెబుతూనే నిరు పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు వాపోయారు. ఇప్పటికైన అర్హులను గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి రాష్ట్రంలో కొత్తగా 154 మందికి కరోనా