గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్దిదారులకు కేటాయించకుండా ప్రభుత్వం కక్షసాధింపు చేస్తుందంటూ సీపీఐ నేతలు ఆరోపించారు. అనంతపురంలో సీపీఐ నాయకులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ, తెదేపా ఆధ్వర్యంలో గుంతకల్లు, గుత్తిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాల్లోకి లబ్దిదారులచే గృహప్రవేశాలు చేశారు. అనంతరం టిడ్కో గృహాలకు తోరణాలు కట్టి, గుమ్మడికాయతో హారతి ఇచ్చి ఇళ్లలోకి ప్రవేశింశారు. టిడ్కో గృహాలు శిధిలావస్థకు చేరక ముందే లబ్ధిదారులకు అందజేయాలని, గృహాల కోసం కట్టిన డిపాజిట్ డబ్బులకు వడ్డీలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల కేటాయించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అయితే గృహాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి...