సమయపాలనకు అనుగుణంగా పౌష్టికాహారం తీసుకోవటం వల్ల కరోనాపై విజయం సాధించవచ్చని... కరోనా నుంచి విముక్తి చెందినవారు తెలిపారు. కరోనాపై విజయం సాధించిన పలువురు వ్యక్తులను అనంతపురం మున్సిపల్ అధికారులు పరిచయం చేశారు.
జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తీరును వారు వివరించారు. వైద్యులు వారిపట్ల చూపిన ప్రేమాభిమానాలను అక్కడ ఉన్న మౌలిక వసతులు పలు అంశాలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కరోనా వస్తే ఎవరు భయపడాల్సిన పనిలేదని.. సమయానికి మందులు, మంచి ఆహారం తీసుకోవటం వల్ల పునరావృత స్థితికి రావచ్చని చెప్పారు.
ప్రతి ఒక్కరూ 6 అడుగుల భౌతికదూరం, మాస్కు, గ్లౌజ్లు ధరించటం చాలా అవసరం అని తెలిపారు. వైరస్ సోకిన వారిని అంటరాని వాడిగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అధికారులు సూచనలను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు.
ఇదీ చూడండి
పీజీ వైద్యవిద్య విద్యార్థులకు శుభవార్త.. కటాఫ్ మార్కులు రెండింతలు తగ్గింపు