అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఆక్సిజన్ అందకపోవటం వల్లే వారు మృతి చెందినట్లు రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు.
'సర్వజన ఆస్పత్రి ఘటన దురదృష్టకరం'
సర్వజన ఆస్పత్రి ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన..జేసీని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆక్సిజన్ సమస్య కాదని అధికారులు చెబుతున్నట్లు వెంకటరామిరెడ్డి వెల్లడించారు. బాధితుల బంధువుల వాదన వేరేలా ఉందని..ఆక్సిజన్ అందకే చనిపోయినట్లు బంధువుల ఆరోపిస్తున్నారన్నారు. ఆస్పత్రికి సంబంధించి లోపాలు సవరించుకుంటూ వచ్చామన్నారు. ఆక్సిజన్ సరఫరాపై గత 3 రోజుల నుంచి అధికారులను హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు. ఇవాళ్టి ఘటనపై చర్యలు తీసుకుంటామన్నారు.
'ఆ వార్తలు నిజం కాదు'
కొవిడ్ వార్డుల్లో నిన్నటి నుంచి ఇప్పటివరకు 21 మంది మృతి చెందినట్లు జేసీ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు. ఆక్సిజన్ కొరత వల్ల చనిపోయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. వివిధ కారణాలతో బాధితులు చనిపోయారే తప్ప ఆక్సిజన్ అందక కాదని వెల్లడించారు. ఆస్పత్రిలో సరిపడా ఆక్సిజన్ ఉందని స్పష్టం చేశారు.
ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యలు
ఇదిలా ఉండగా..కొవిడ్ వార్డులో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యలు సరిచేసేందుకు చెన్నై నుంచి నిపుణుల బృందం వచ్చిందని చెప్పటం రోగుల బంధువుల ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
ఇదీ చదవండి:
నలుగురు కొవిడ్ రోగులు మృతి.. ఆక్సిజన్ అందకనే అంటున్న బంధువులు!