అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. పదో తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థునులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయింది.
తోటి విద్యార్థినుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న మండల విద్యాధికారి గోపాల్ నాయక్ పాఠశాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మిగిలిన విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాల మొత్తం శానిటైజ్ చేశారు.
ఇదీ చదవండి:
కనిశెట్టిపల్లి గ్రామంలో చిరుత కలకలం.. పంట పొలాల్లో జింక కళేబరం