నేటి నుంచి కరోనా వైరస్ పరీక్షలు అనంతపురంలోనే నిర్వహించనున్నారు. పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్ పర్యవేక్షణలో ఈ టెస్టులను నిర్వహించేలా జిల్లాలోని వైద్యకళాశాల మెక్రోబయాలజీ విభాగం వైద్యులకు ఎనిమిది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. వైరస్‌కు సంబంధించిన యంత్రాలను కేంద్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అనంతపురానికి పంపించింది. మామాలుగా వైరస్‌లపై పరీక్షలు నిర్వహించే మెక్రోబయాలజీ విభాగానికి కొద్దిపాటి మార్పులు చేసి, మౌలికసదుపాయాలు కల్పించి పరీక్షలకు సిద్దం చేసినట్లు వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీరజ తెలిపారు. తాము చేసిన నమూనా పరీక్షలు కచ్చితత్వంతోనే ఉన్నాయని పుణే ప్రయోగశాల నిర్థారించినందునే నేటి నుంచి క్షేత్రస్థాయి నుంచి వచ్చే నమూనాలను పరీక్షించనున్నట్లు మైక్రోబయోలజీ నిపుణులు డా.ప్రియాంక చెప్పారు.
ఇవీ చదవండి