అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్బీఎన్, ఆర్ట్స్ కళాశాల, సీడీ ఆసుపత్రి, రుద్రంపేటలోని పాత రిలయన్స్ కార్యాలయాల్లో కరోనా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో పనిచేసే సిబ్బందికి నెలన్నరగా వేతనాలు చెల్లించడంలేదు. దీంతో వారు శనివారం విధులు బహిష్కరించి ఆందోళన చేశారు. దీంతో పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన జనం నిరాశగా వెనుదిరిగారు. కొవిడ్‌పై పోరులో ముందుండి పోరాడుతున్న తమకు వేతనాలు సమయానికి ఇవ్వకపోతే ఎలా అంటూ సిబ్బంది ప్రశ్నించారు. పై అధికారులు స్పందించి త్వరలోనే జీతాలు ఇస్తామని హామీ ఇవ్వటంతో విధులకు హాజరయ్యారు.
ఇవీ చదవండి..