ETV Bharat / state

covid effect: కరోనా కాటుతో.. బతుకు లేక ఉపాధి కోసం బడిపంతులు వేట!

పుస్తకం పట్టిన చేతులు.. తాపీలు పట్టాయి. ప్రయోగాలు వివరించిన వారు.. వైరింగ్‌ పనులు చేస్తున్నారు. ఆటలాడించిన పీఈటీలు తోపుడు బండ్లు పెట్టుకున్నారు. లెక్కలు చెప్పిన వారు.. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులు.. ఉపాధి పనులకు వెళ్తున్నారు. బోధన తప్ప మరో వ్యాపకం తెలియని వారు.. చిరువ్యాపారులుగా మారారు. బొమ్మలేసి పాఠం చెప్పిన వారు.. పెయింటింగ్‌ వేస్తున్నారు. శాస్త్రాలు వివరించిన వారు.. సేద్యం చేసేందుకు సిద్ధమయ్యారు. బడిగంటలు మూగబోయాయి.. ప్రైవేటు పాఠశాలల తలుపులు మూతబడ్డాయి. ప్రైవేటు బడిపంతుళ్ల జీవనం భారంగా మారింది. అద్దెలు వెంటాడుతున్నాయి.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి.. ఆకలి మంటలతో కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇదీ అనంతపురం జిల్లాలో ప్రైవేటు టీచర్ల దీనావస్థ.

teachers
ఉపాధి వేటలో టీచర్లు
author img

By

Published : May 31, 2021, 11:29 AM IST

‘బతకలేక బడి పంతులు’ అనేది నాటి నానుడి. బతుకు లేక బడిపంతులు అనేది ప్రస్తుతం ప్రైవేటు ఉపాధ్యాయులకు పర్థిస్థితి. కొవిడ్‌ కారణంగా గురువు బతుకు బండి తలకిందులైంది. గత ఏడాది పరిస్థితి నుంచి కోలుకునేలోపే మళ్లీ ఈ సంవత్సరం ఏప్రిల్‌ నుంచి పాఠశాలలు మూత పడ్డాయి. గురువులకు వేతనాలు ఇవ్వడం లేదు. కొవిడ్‌ తగ్గేదెప్పుడు తమ బతుకులు మారేేదెన్నడో తెలియక గురువు బతుకు బండి సాగడం లేదు. అనంతపురం జిల్లాలో వేలాది మంది ప్రైవేటు టీచర్లు బేల్దారి పనికి, ఉపాధి హామీ పథకం, వైరింగ్‌ పనులు, తోపుడు బండి, పెయింటర్‌ పనులకు, చిన్న చిన్న దుకాణాలు, సేద్యం పనులు ఇలా ఎవరికి అందుబాటులో ఉన్న పనులు వారు చేస్తున్నారు.

ప్రభుత్వం ఆదుకుంటేనే మనుగడ

ప్రభుత్వం కరవు పరిస్థితుల నుంచి సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటోంది. ప్రైవేటు ఉపాధ్యాయులను కనికరించడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కరోనాతో విద్యాసంస్థలు మూతపడి ఉపాధి కోల్పోయిన ప్రైవేటు ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక, నిత్యాసరాలతో ఆదుకుంటోందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయంతో కుటుంబ పోషణకు కొంత ఊతమివ్వాలని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఉన్నత విద్య చదివారు. కాయాకష్టం చేయలేరు. మరోపనిచేయాలంటే చేతకాదు. తప్పని స్థితిలో ఉపాధి పనులకెళ్దామన్నా జాబ్‌కార్డు వంటి సమస్యలున్నాయి. కరోనా సమసి, పరిస్థితులు కుదటపడే దాకా ఆర్థికంగా నెలకింద సాయం చేసి ప్రభుత్వం, యాజమాన్యాలు ఆదుకోవాలని ప్రైవేటు టీచర్లు వేడుకుంటున్నారు.

2020తో మొదలైన కష్టాలు

కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్రం 2020 మార్చి 20న జనతా కర్ఫ్యూ ప్రకటనతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఐదారు నెలల పాటు పాఠశాలలు తెరచుకోలేదు. ఆ తర్వాత మొదట పది, తొమ్మిదో తరగతులను ప్రారంభించారు. 2021 జనవరి మూడో వారం నుంచి ప్రాథమిక పాఠశాలలను మొదలు పెట్టారు. రెండు నెలలు కూడా తరగతులు సజావుగా జరగకుండానే మళ్లీ సెకండ్‌ వేవ్‌తో పాఠశాలలకు విరామం ప్రకటించారు. ఉపాధ్యాయులకు పనిలేకుండా పోయింది. సుమారు ఏడాది కాలం పాటు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కొలువు, వేతనానికి దూరమయ్యారు. కుటుంబాల అవసరాలకు సంపాదన కరవై ఉపాధి కోసం ప్రత్యామ్నాయ మార్గాలకు వెతుకులాట మొదలు పెట్టారు. ఉపాధి కూలీలు, చిరువ్యాపారాలు, పాడిపరిశ్రమ వంటి రంగాల్లో ఉపాధి పొందేందుకు జీవన సమరం చేస్తున్నారు. తమవల్ల కాకపోయినా.. కుటుంబ బాధ్యతల కోసం కష్టపడుతున్నారు.

చదివినా దొరకని ఉపాధి

అమ్మానాన్న వృద్ధులు. నేనొక్కడినే సంతానం. ఎంఏ, బీఎడ్‌ చదివా. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవటంతో ఓడిచెర్వు ప్రైవేటు పాఠశాలల సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడిగా పనిచేసేవాణ్ని. పాఠశాలలు సక్రమంగా నడవక జీతాల్లేవు. గతంలో నెలకు రూ.15వేల దాకా వేతనం ఇచ్చేవాళ్లు. ప్రస్తుతం వేతనం రాక.. తల్లిదండ్రులు, భార్యాపిల్లల పోషణ భారంగా మారింది. ఉపాధి పనులకెళ్తున్నా. రోజుకు రూ.150దాకా చెల్లిస్తున్నారు. నెలకు రూ.5వేల్లోపు సంపాదన చాలకపోయినా.. సర్దుబాటుతో జీవనం సాగిస్తున్నాం. - కె.శ్రీనివాసులు, శెట్టివారిపల్లి, ఓబుళదేవరచెరువు

బోధనే ఉపాధి

ఎంఏ, టీపీటీ చదువుకున్నా. బోధనతోనే నాకు ఉపాధి. తెలుగు పండిట్‌ పనిచేస్తూ నెలకు రూ.9వేలు వేతనం పొందేవాణ్ని. ప్రస్తుతం వేతనాలు పొందలేకపోతున్నాం. సుమారు ఏడెనిమిది నెలల పాటు ఎలాంటి ఉపాధి లేదు. పోషణ, అవసరాలకు చాలా కష్టంగా మారింది. ఏదైనా పనిచేద్దామంటే.. బోధన తప్ప ఏపనీ రాదు. మిత్రులతో చేబదులుతో కాలం వెళ్లదీస్తున్నా. పాఠశాలలు తెరవటం ఆలస్యమైతే.. అప్పులు భారంగా మారనున్నాయి. మాలాంటి వారికి ప్రభుత్వమే సాయమందించి ఆదుకోవాలి. - నాగేంద్ర, తెలుగు ఉపాధ్యాయుడు, నల్లమాడ

దుస్తుల వ్యాపారం చేస్తున్నా..

ఇరవెై ఏళ్లుగా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నా. రెండు పాఠశాలల్లో ఉదయం, మధ్యాహ్నం పనిచేయడం వల్ల నెలకు రూ.12వేలు జీతం వచ్చేది. గత ఏడాది నుంచి పాఠశాలలు లేక ఉపాధి కరవై దయనీయ పరిస్థితి నెలకొంది. దొరిగల్లు రోడ్డలో బాడుగకు దుకాణం తీసుకుని దుస్తుల వ్యాపారం ప్రారంభించా.. కొవిడ్‌ నిబంధనల మేరకు కొనుగోలుదారులు తక్కువ సంఖ్యలోనే వస్తున్నారు. కర్ఫ్యూ ఉండటంతో మధ్యాహ్నం తరువాత దుకాణాలు మూసేస్తున్నాం. వ్యాపారం కూడా అంతంతమాత్రంగానే నడుస్తోంది. - రామప్ప, ముదిగుబ్బ

ఆర్థికంగా నష్టపోయాం

కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. పదేళ్లకుపైగా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశా. నెలకు రూ.10వేలు జీతం రావడంతో కుటుంబం గడిచేది. కరోనా నేపథ్యంలో ఏడాదిగా ఇదే పరిస్థితి నెలకొనడంతో దిక్కుతోచలేదు. కుటుంబానికి ఆసరాగా కదిరి రోడ్డులో దుస్తుల దుకాణం నిర్వహిస్తున్నా. వచ్చిన అరకొర ఆదాయంతోనే కుటుంబం పోషణ గడుస్తోంది. విపత్కర సమయంలో ప్రభుత్వాలు స్పందించి ప్రైవేట్‌ ఉపాధ్యాయుల కుటుంబాలను ఆదుకోవాలి. - లక్ష్మణ్‌, ముదిగుబ్బ

జిల్లా వ్యాప్తంగా 2020 లెక్కల ప్రకారం..

* మండలాలు: 63

* ప్రైవేటు పాఠశాలలు: 1,224

* ఉపాధ్యాయులు: 5,417

* విద్యార్థులు: 2,20,2241

* ప్రభుత్వ ఉపాధ్యాయులు: 17,058

* ప్రైవేటు కళాశాలలు సుమారు (ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ, డిగ్రీ, పీజీ): 450

* అధ్యాపకులు సుమారు: 4,700

ఇదీ చదవండి:

Corona winners: 'మనోధైర్యమే బతికించింది'.. కరోనా విజేతల అంతరంగం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.