ETV Bharat / state

కదిరిలో కరోనా ఉద్ధృతి... ఇక లాక్​డౌన్​ ఒక్కటే మార్గం..!

కదిరి పట్టణంలో కరోనా వైరస్​ విజృంభిస్తుంది. మంగళవారం ఒక్క రోజే పట్టణంలో 10 మందికి కరోనా వైరస్​ వచ్చినట్లు వైద్యులు నిర్ధరణ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. లాక్​డౌన్​ నిబంధనలు పటిష్ఠంగా అమలు చేస్తామని తెలిపారు. ఎవరైనా వీటిని అతిక్రమిస్తే క్వారంటైన్​కు తరలిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మాస్కులు లేకుండా వీధుల్లోకి వస్తే జరిమానా తప్పదని తేల్చిచెప్పారు.

corona cases increasing in kadiri in ananthapur district
తమ వీధుల్లోకి ఎవరూ రాకుండా ముళ్ల పొదళ్లను అడ్డుగా పెట్టిన కదిరి వాసులు
author img

By

Published : Jun 24, 2020, 2:02 PM IST

అనంతపురం జిల్లా కదిరిలో ఒకే రోజు పది మందికి కరోనా వైరస్​ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఫలితంగా అక్కడి స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అనుమానితులను ఐసోలేషన్​కు తరలించారు. బాధితుల కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వ్యాధిని నియంత్రించే క్రమంలో పట్టణంలో లాక్​డౌన్​ నిబంధనలు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రజలు వీటిని కచ్చితంగా పాటించాలని చెప్పారు. నిత్యావసర సరకుల దుకాణాలు మినహా అన్నింటినీ మూసివేస్తున్నట్లు తహసీల్దార్ ప్రకటించారు. ప్రజలు తమ వీధుల్లోకి ఇతరులు రాకుండా ముళ్లకంచెలు, బారికేడ్లతో మూసేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని నేరుగా క్వారంటైన్​కు తరలిస్తామని అధికారుల హెచ్చరించారు.

ఇదీ చదవండి :

మార్కాపురంలో 14 రోజులపాటు పూర్తి లాక్​డౌన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.