ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

author img

By

Published : Nov 26, 2020, 1:15 PM IST

Updated : Nov 26, 2020, 9:43 PM IST

రాష్ట్రవ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్​ మేథో సంపత్తిని నేతలు కొనియాడారు. అంబేడ్కర్​ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విద్యావేత్త అయిన అంబేడ్కర్​ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు
భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలు

కృష్ణాజిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అంబేడ్కర్ స్ఫూర్తిగా పథకాల అమలు :

విజయవాడలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తాడేపల్లి వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా తితిదే ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు ఆదిమూలపు సురేశ్​, వెల్లంపల్లి శ్రీనివాస్​, శంకర నారాయణ, ఎంపీ నందిగం సురేశ్​, ఎమ్మెల్యే మేరుగు నాగార్జున పార్టీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తూ సీఎం జగన్ పథకాలు అమలు చేస్తున్నారని సుబ్బారెడ్డి అన్నారు.

"విద్య, వైద్యం అందరికీ అందించాలనే బి.ఆర్ అంబేడ్కర్ ఆశయాన్ని సీఎం నెరవేర్చుతున్నారు. సామాజిక న్యాయాన్ని అన్ని వర్గాలకు అందిస్తోన్న ఘనత జగన్మోహన్​ రెడ్డిది. జగన్​ పాలనలో అన్ని వర్గాల మహిళలకు కీలక పదవులు, సమాన అవకాశాలు దక్కుతున్నాయి. సమ సమాజ స్థాపనకు అంబేడ్కర్ చేసిన కృషి ఎనలేనిది. ఆయన స్పూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు" -మేకతోటి సుచరిత, హోంమంత్రి

అనంతపురం జిల్లా:

జిల్లాలోని పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్​ విగ్రహానికి పూల మాలలు వేశారు. విభిన్న సంస్కృతులు కల భారతదేశంలో.. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని.. అందరికీ సమానత్వం కల్పిస్తూ.. రాజ్యాంగాన్ని రాశారని ఎమ్మెల్యే కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తితో రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

'భారతదేశ ప్రజలమైన మేము' :

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 'భారతదేశ ప్రజలమైన మేము' అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భారత రాజ్యాంగ ఘట్టాల చిత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. రుద్రంపేట ఫ్లైఓవర్​ బ్రిడ్జికి అంబేడ్కర్​ వంతెనగా నామకరణం చేశారు.

మడకశిర:

మడకశిర నియోజకవర్గంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి రాజ్యాంగ పీఠికను చదివి విద్యార్థులకు తెలియజేశారు.

విశాఖ జిల్లా:

విశాఖలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అంబేడ్కర్ చెప్పినట్టు మనిషికి..మనిషే సహకరించుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కేజీహెచ్ విశ్రాంత సూపరింటెండెంట్ జి.అర్జున్, డీసీపీ సురేశ్​బాబు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

విశాఖపట్నం పోర్టు ట్రస్టులో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ శ్రీ రామ్ మోహన్ రావు, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్యాంగ దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని విశాఖ‌లో ప‌్రత్యేక పోస్టల్ క‌వ‌ర్లు విడుద‌ల చేశారు. అంబేడ్కర్ విశాఖ రైల్వే స్టేష‌న్ నుంచి తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన్ని ప్రాంతాల‌కు ప‌ర్యటించిన స్ఫూర్తి వంత‌మైన ప్రయాణానికి గుర్తుగా ఈ కవర్లను రాష్ట్ర పోస్టల్ విభాగం రూపొందించింది. విశాఖ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద రాష్ట్ర పోస్టు మాస్టర్ జ‌న‌ర‌ల్ ఎం. వెంక‌టేశ్వర్లు, డీఆర్ఎం చేత‌న్ కుమార్ శ్రీ‌వాస్తవ ప్రత్యేక పోస్టల్ క‌వ‌ర్​ను విడుద‌ల చేశారు.

రాజ్యాంగ దినోత్సవం సంద‌ర్బంగా విశాఖ‌లోని తూర్పు నౌకాద‌ళం ప‌లు యూనిట్ల‌లో ప్రతిజ్ఞల‌ను నిర్వహించారు. నౌకాద‌ళ ప్రధాన కార్యాల‌యం స‌హా వివిధ నౌకాయూనిట్లు, ఆర్మ్ డిపోలు, జ‌లాంత‌ర్గాములు, యుద్ద నౌక‌ల‌లో సిబ్బంది ఈ ప్రతిజ్ఞా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యాంగం అందించిన ర‌క్షణ‌ల వ‌ల్లనే దేశంలో అన్ని వ‌ర్గాల అభివృద్ధి సాధ్యప‌డుతోంద‌న్నారు.

పాడేరు:

భారత రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం పాడేరు ఐటీడీఏలో ప్రాజెక్ట్ అధికారి డా.వెంకటేశ్వర్​ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. పాడేరు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ అధికారులు, ఉద్యోగులు రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం అని ప్రాజెక్ట్ అధికారి కొనియాడారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకుడు, ఐటీడీఏ పరిపాలనాధికారి, ఐటీడీఏ ఉద్యోగులు, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా :

జిల్లాలోని జీలుగుమిల్లిలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మూడు సంవత్సరాలపాటు అహర్నిశలు శ్రమించిన బాబాసాహెబ్ అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించారని సంఘం అధ్యక్షుడు అన్నారు. దీనివల్ల అణగారిన వర్గాల వారికి న్యాయం జరిగిందని పేర్కొన్నారు. పేదలు వారి హక్కులను సాధించుకునేందుకు రాజ్యాంగం ఎంతగానో దోహదపడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా :

దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ గొప్ప దార్శనికుడు అని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జిల్లాలోని పి,గన్నవరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. గొప్ప విద్యావేత్త అయిన అంబేడ్కర్ యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

విజయనగరం జిల్లా:

ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పెట్టని కోట అని విజయనగరం జిల్లా కలెక్టర్ హరి జవహర్​లాల్ అభివర్ణించారు. నవంబర్ 26 దేశ చరిత్రలోనే అద్భుతమైన ఘట్టమని, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేడ్కర్​​ను గుర్తుచేసుకోవడం భారతీయుల కర్తవ్యమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 26న సంవిధాన్ దివాస్ (రాజ్యాంగ దినోత్సవం) జరుపుతున్నామని కలెక్టర్​ అన్నారు. ఇదే రోజున జాతీయ న్యాయ దినోత్సవం కూడా జరుపుకోవడం విశేషమని తెలిపారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం అవసరమని ఆయన అన్నారు. జాతీయ పండుగలు జరుపుకోవడం వలన జాతి సమైఖ్యత, ఐకమత్యం వర్దిల్లుతాయని పేర్కొన్నారు. అనంతరం సంయుక్త కలెక్టర్ డా.జి.సి కిషోర్ కుమార్ రాజ్యాంగంలోని పీఠికను చదివి సభలో హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు.

చిత్తూరు జిల్లా:

జిల్లాలోని నగరి మున్సిపాలిటీ పరిధిలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే రోజా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్ ఆశయాలు ఎప్పటికీ ఆచరణీయమేనని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్, మేనేజర్, దేశమ్మ ఆలయ కమిటీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ప్రపంచంలోనే అత్యుత్తమైన రాజ్యంగం మనది'

Last Updated : Nov 26, 2020, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.