కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరుకు సిద్ధమైనట్లు... కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ అన్నారు. భాజపా ప్రభుత్వం ఏ పార్టీని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవసాయ చట్టాలు అమలు చేస్తోందని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన అనంతపురం చేరుకున్నారు.
వ్యవసాయం రాష్ట్ర అంశంగా ఉన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే చట్టాలు చేస్తున్నారంటూ విమర్శించారు. కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ ప్రారంభించామన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా రైతులతో కలిసి ఎక్కడికక్కడ ట్రాక్టర్ ర్యాలీలతో ఆందోళన నిర్వహించి... రైతు వ్యతిరేక విధానాలపై పోరాడుతామని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: