అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంపై.. పట్టణంలోని ఆర్యపేటవీధిని అధికారులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. అది జరిగి 31 రోజులు గడిచినా... జోన్‌ను తొలగించలేదని ఆ వీధి వాసులంతా ఉదయం ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నానికి స్పష్టత ఇస్తామని ఎస్ఐ తెలపగా... ఆందోళన విరమించుకున్నారు.
అధికారులు చెప్పిన సమయానికి రాకపోవడంపై... ఆగ్రహించిన వీధి వాసులు బయటకు వచ్చి రహదారిపై బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులకు, కాలనీ వాసులకు వాగ్వాదం జరిగింది. చివరకు తహసీల్దార్ కలగజేసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం రెడ్‌జోన్‌ను తొలగించేందుకు చర్యలు చేపడతామని చెప్పగా.. వారు శాంతించారు.
ఇదీ చదవండి: