అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో కలెక్టర్ గంధం చంద్రుడు ఏరువాక కార్యక్రమాన్ని పరిశీలించారు. విత్తన గొర్రు ద్వారా విత్తనాలు ఎలా విత్తుతారు అనే విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు.
నేటి యువతరానికి వ్యవసాయం ప్రాధాన్యత విలువలను తెలపడం కోసమే కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గ్రామంలోని వర్షాభావ పరిస్థితులపై రైతులతో చర్చించారు.
ఇవీ చూడండి...