అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ సిరి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మూడొందల పడకలతో ఏర్పాటు చేస్తున్న ఈ ఆస్పత్రిలో అన్ని వసతులు కల్పించాలని చెప్పారు. దీనిని త్వరగా ప్రారంభించి జిల్లాలోని కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఆస్పత్రిలోనూ పడకల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: 'కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'
తాత్కాలిక కొవిడ్ ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్
కొవిడ్ చికిత్స కోసం అనంతపురం జిల్లాలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న ఆస్పత్రిని ఆ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ సిరి పరిశీలించారు. ఈ ఆసుపత్రి ద్వారా కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని తెలిపారు.