ETV Bharat / state

'సిబ్బందికి సేవా దృక్పథం అవసరం' - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురంలోని నార్పల మండలంలోని గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ ఉద్యోగులు అందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.

collector visit grama sachivalayam
collector visit grama sachivalayam
author img

By

Published : Oct 17, 2020, 6:54 PM IST

అనంతపురం జిల్లా.. నార్పల మండలం గూగూడు గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఫంక్షనల్ అసిస్టెంట్ వారీగా చేస్తున్న పనిని సమీక్షించారు. సచివాలయ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం.. ప్రభుత్వ సేవలను ప్రజల ముందుకు తీసుకెళ్లటం కావున.. అందరూ అంకితభావంతో పనిచేయాలన్నారు.

సేవా దృక్పథంతో ప్రతి ఉద్యోగి పని చేస్తేనే ప్రజలకు పథకాలు అందుతాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు, భీమా, జగనన్న తోడు వంటి కార్యక్రమాలను ఫంక్షనల్ అసిస్టెంట్లు గ్రామ వాలంటీర్లు ప్రజలకు తెలియజేయాలన్నారు. సిబ్బంది సమన్వయంతో పనిచేసి సచివాలయ వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు.

ఇదీ చదవండి:

కరోనా వ్యాక్సిన్ పంపిణీపై మోదీ కీలక సూచనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.