స్పందించే ప్రభుత్వం ఇది: విప్ కాపు రామచంద్రారెడ్డి - పూలకుంటలో కలెక్టర్ విప్ కాపు రామచంద్రుడు
సమస్యలపై స్పందించే ప్రభుత్వం తమదని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా పూలకుంటలో అదనపు తరగతులు, మరుగదొడ్ల నిర్మాణానికి ఆయన జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుతో కలిసి భుమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఇతర అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలోని మండల పరిషత్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భూమి పూజ చేశారు. 30.75 లక్షల రూపాయలతో, మనబడి నాడు - నేడు కార్యక్రమం కింద నిర్మాణాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి విద్యార్థుల సంక్షేమం కోసం వైఎస్సార్ వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులంత కష్టపడి చదవి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు కలెక్టర్ గంధం చంద్రుడు సూచించారు. మరుగుదొడ్ల నిర్మాణాలు త్వరగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: వలస నివారణే లక్ష్యంగా.. అగరబత్తి పరిశ్రమ ఏర్పాటు