ETV Bharat / state

అయోధ్య రామమందిరం కోసం విరాళాల సేకరణ

అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆర్ఎస్ఎస్ నేతలు విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. హిందూపురంలో మొదలైన ఈ కార్యక్రమం 15 రోజుల పాటు నియోజకవర్గమంతటా జరుగుతుందన్నారు.

collection of donations in hindupuram for ayodhya ram mandir
అయోధ్య రామమందిరం కోసం హిందూపురంలో విరాళాల సేకరణ
author img

By

Published : Jan 15, 2021, 10:28 PM IST

అయోధ్య రామమందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధి సేకరణ కార్యక్రమం చేపట్టారు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా జరుగుతున్న శ్రీ రామ మందిరం నిర్మాణం కోసం నిధి సేకరణ చేస్తున్నట్టు ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ సభ్యులు తెలిపారు.

హిందూపురం మోడల్ కాలనీలో ప్రారంభమైన ఈ నిధి సేకరణ పదిహేను రోజులపాటు నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతుందని.. ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆర్ఎస్ఎస్​ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ నిధి సేకరణను శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వారికి అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ఇదీ చదవండి

అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.