రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటివెలుగు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా తొలి దశలో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను చేపట్టనున్నట్లు తెలిపారు. కంటి వెలుగు పథకంపై ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యాకర్తలకు అధికారులు శిక్షణ ఇచ్చి అవగాహన కార్యాక్రమాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.. నవంబర్, డిసెంబర్ నెలల్లో సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తారని తెలిపారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు, వైద్య సదుపాయాలు అందిస్తామని అన్నారు.. జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్రం మొత్తం కంటివెలుగు పథకం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుందని ప్రకటించారు. రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల పన్నెండు లక్షల మంది ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన అన్నారు. కొంచెం ధ్యాస పెడితే 80 శాతం ప్రజలకు కంటి చూపు సమస్యలు తొలిగిపోయేవనీ, గత ప్రభుత్వం కంటి చూపు గురించి పట్టంచుకోలేదని విమర్శించారు. గ్లకోమా, రెటినోపతి వంటి కంటి సమస్యలకు పూర్తి ఉచితంగా చికిత్స చేస్తారని ముఖ్యమంత్రి వివరించారు.
ఇదీ చదవండి : వైఎస్సార్ కంటివెలుగు పథకానికి నేడే శ్రీకారం