వైదారోగ్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు(cm jagan review on medical health department news). కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్, మెడికల్ కళాశాలలు, హెల్త్ హబ్స్ నిర్మాణంపై చర్చించారు. హెల్త్ హబ్స్(health hubs in ap news)లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల వివరాలపై సీఎం ఆరా తీశారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మన రాష్ట్రంలోనే చికిత్స అందించే విధంగా ఉండాలన్నారు. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టి ఆ రకమైన వైద్య సేవలు స్థానికంగానే ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు. మనకు కావాల్సిన స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు.
104 వాహనాల కొనుగోలు..
రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణ ప్రగతి(medical colleges in ap news)పై సీఎం సమీక్షించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించాలని సూచించారు. పనులు శరవేగంగా ముందుకు సాగాలన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌పైనా సమీక్షించిన సీఎం జగన్.. కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఉన్న పీహెచ్‌సీల్లో నాడు- నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు.. వీటిని పూర్తిచేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జనవరి 26 నాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని స్పష్టించారు.
విలేజ్ క్లినిక్స్(village clinics in ap news) నిర్మాణంపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్. మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య శ్రీ పథకం వివరాలు సహా ఆరోగ్య మిత్ర ఫోన్ నెంబర్లను తెలియజేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్ పెట్టాలని సీఎం ఆదేశించారు. డిజిటల్ పద్దతుల్లో ఎంపానెల్ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఏపీ డిజిటల్ హెల్త్‌పై సమీక్షించిన సీఎం.. హెల్త్‌కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ కూడా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలన్నారు. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు, బ్లడ్ గ్రూపులు.. ఇలా ప్రతి వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలన్నారు. దీనివల్ల వైద్యం కోసం ఎక్కడకు వెళ్లినా ఈ వివరాలు ద్వారా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుందన్నారు. డిజిటిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ కూడా హెల్త్‌ఐడీలు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కొవిడ్ నివారణ, వ్యాక్సినేషన్‌పై సీఎంకు అధికారులు వివరాలందించారు. రాష్ట్రంలో యాక్టివ్ పాజిటివ్ కేసులు 9,141 ఉన్నాయని, రికవరీ రేటు 98.86 శాతం ఉందన్నారు. 2001 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 1.62 శాతం ఉందన్న అధికారులు, 0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు 12 ఉండగా.. 3 లోపు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా ఒకటి ఉందన్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల దృష్ట్యా సన్నద్ధంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
'వైద్య కళాశాలలకు సంబంధించి పెండింగ్ అంశాలపై దృష్టి పెట్టాలి. నెలాఖరు నాటికి పెండింగ్ అంశాలు పరిష్కరించాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు 104 వాహనాల కొనుగోలు చేయండి. జనవరి 26 నాటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ అమల్లోకి తేవాలి. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి' - సీఎం జగన్
ఇదీ చదవండి