Clashes Between YCP and TDP Activists: అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరులో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉగాది సందర్భంగా పొలాల్లో ఎద్దులతో తొలి సేద్యం చేయాలని ఇరు వర్గాలు పోటీపడ్డాయి. రెండు పార్టీలకు చెందిన రైతులు వ్యవసాయ భూముల వైపు వెళ్లారు. వైకాపా తెదేపా వర్గీయులు మధ్య మాటా మాటా పెరిగి పరస్పర దాడులకు దిగారు. ఈ ఘర్షణలో ఆరుగురు తీవ్రంగా గాయ పడ్డారు. బాధితులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదీ చదవండి : సర్కారు తీరును మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం - అమరావతి రైతులు