ETV Bharat / state

రాయదుర్గంలో సీఐడీ అధికారుల తనిఖీలు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఈ తనిఖీలు నిర్వహించినట్లు కర్నూలు సీఐడీ ఇన్​స్పెక్టర్​ రుషికేష్ అన్నారు.

cid officers raids in rayadurgam
రాయదుర్గంలో సీఐడీ అధికారుల తనిఖీలు
author img

By

Published : Apr 11, 2021, 2:05 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కర్నూలు సీఐడీ ఇన్​స్పెక్టర్​ ఎస్. రుషికేష్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వాసుపత్రిలోని రికార్డులు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొనుగోలు చేసిన పరికరాలపై తలెత్తిన అవినీతి ఆరోపణలపై రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రాంతీయ ఆస్పత్రులు, కమ్యూనిటీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో 2015 సంవత్సరం నుంచి 2018 వరకు కొనుగోలు చేసిన పరికరాల విలువ, వాటి నిర్వహణపై కర్నూలు సీఐడీ ఇన్​స్పెక్టర్​ ఎస్. రుషికేష్ ఆరా తీశారు. తనిఖీల అనంతరం నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు వెల్లడించారు.

ఇవీచదవండి.

నారాకోడూరులో విషాదం...రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

తిరుపతిలో తెదేపా గెలిస్తే మా ఎంపీలు రాజీనామా చేస్తారు: పెద్దిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.