భారీ వర్షానికి అనంతపురం జిల్లాలోని చిత్రావతి నది పొంగిపొర్లుతోంది. ధర్మవరం మండలం పోతులనాగేపల్లి, తుంపర్తి గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు. పోతుల నాగేపల్లి వద్ద చిత్రావతి నదిపై తాత్కాలికంగా నిర్మించిన వంతెన నీటి ప్రవాహానికి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో పోతుల నుంచి కనంపల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షంతో నదిలోకి నీరు రావటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి..