అనంతపురం జిల్లా పామిడి ప్రజలు చిరుత భయంతో ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఆదర్శ పాఠశాల వద్ద చిరుత అడుగులను పలువురు రైతులు గుర్తించారు. ఇవి చూసిన గ్రామస్తులు.. తమ ఊరిలో పులి సంచరిస్తుందని అనుమానంతో భీతిల్లుతున్నారు. పాఠశాల చుట్టూ అటవీ ప్రాంతంలాగా గుబురుగా చెట్లు, పొలాలు ఉన్నాయి. జింకలు గుంపులు గుంపులుగా పొలాల్లో మేత కోసం వస్తుంటాయి. వాటిని వేటాడేందుకు పులి తిరుగుతున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. అటవీ అధికారులు స్పందించి, ప్రజలకు ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: